News March 16, 2024
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేపథ్యం

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి మండలం తుమ్మలగుంటలో 1973లో జన్మించారు. ఏపీ అభివృద్ధిలో PhD పూర్తి చేశారు. వైయస్ రాజశేఖర్రెడ్డి సహకారంతో 2007లో తుడా ఛైర్మన్ గా పనిచేశారు. 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారు.
Similar News
News April 7, 2025
ప్రకాశం: పండుగ రోజు విషాదం

ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద ముగ్గురు యువకులు బైక్పై ప్రయాణిస్తూ.. అదుపు తప్పి కిందపడ్డారు. వీరిలో నాగిరెడ్డి అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే దొనకొండ మండలం గుట్టమీదపల్లికి చెందిన పిక్కిలి తరుణ్(13) నీటి కుంటలో పడి మృతి చెందాడు.
News April 7, 2025
దొనకొండ: నీటి కుంటలో పడి బాలుడి మృతి

దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు… బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
News April 6, 2025
ఒంగోలు: పూర్తయిన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు. కాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదలవుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు.