News December 26, 2024
ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
SBI 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అప్లికేషన్ విండో ఓపెన్ కానుంది. ఇది 16 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: <
Similar News
News December 28, 2024
స్టాక్స్‌కు దూరం.. FDలకే మన్మోహన్ మొగ్గు
ఆర్థికవేత్తగా తన సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన మన్మోహన్ సింగ్ స్టాక్‌మార్కెట్‌కి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. అందులో ఒడిదుడుకులతో నిద్ర కోల్పోవడం తనకు ఇష్టం లేదని 1992లో పార్లమెంటులో ఆయన చెప్పారు. తన డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో మాత్రమే పెట్టేవారు. 2019 నాటికి ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.15కోట్లు. అందులో FDల్లో రూ.7 కోట్లు, పోస్టాఫీస్‌లో రూ.12 లక్షలు ఉంది.
News December 28, 2024
నేడు మన్మోహన్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.
News December 28, 2024
రెండు పార్టులుగా VD12 మూవీ: నాగవంశీ
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ రెండు పార్ట్‌లుగా రాబోతోందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అయితే రెండు పార్టుల్లో వేర్వేరుగా కథ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తొలి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. మార్చిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే వాయిదా వేస్తామని చెప్పారు.