News December 27, 2024

ఏలూరు జిల్లాలో రూ. 92.02 కోట్లు మంజూరు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.92.02 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల్లో రహదారుల సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలు చేపట్టిందని, సంక్రాంతికి మంజూరు చేసిన సీసీ రోడ్డులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Similar News

News December 28, 2024

ప.గో: గన్ మిస్ ఫైర్..రిటైర్డ్ ఉద్యోగికి గాయాలు

image

సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్‌ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్‌ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి స్టేషన్ బయట కూర్చుని గన్ శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ వేలికి తగిలి మిస్ ఫైర్ అయ్యింది.

News December 28, 2024

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంపై మరోమారు డ్రోన్ కలకలం

image

ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో శుక్రవారం రాత్రి మరోమారు డ్రోన్ ఎగుర వేయడం దుమారం రేపింది. ఇటీవల శ్రీవారి క్ష్రేతం మీదుగా ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో యూట్యూబర్‌పై ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. వరుసగా రెండో సారి ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది డ్రోన్ ఎగుర వేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు చిక్కలేదు.

News December 28, 2024

ప.గో: డెడ్‌బాడీ పార్శిల్ కేసు దర్యాప్తులో మహిళాధికారి కీలక పాత్ర

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు, ముద్దాయిలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేదను శుక్రవారం జిల్లా ఎస్పీ నయీం ఆస్మి అభినందించారు. ఆయన చేతుల మీదుగా అభినందన జ్ఞాపికను డీఎస్పీ శ్రీవేద అందుకున్నారు.