News March 16, 2024
నాలుగోసారి మామాఅల్లుళ్ల పోటీ

AP: శ్రీకాకుళం(D) ఆమదాలవలసలో మరోసారి మామాఅల్లుళ్ల పోటీ జరగనుంది. కూన రవికుమార్(TDP)కి స్పీకర్ తమ్మినేని సీతారాం(YCP) స్వయాన మేనమామ. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధంతో స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇప్పటికే 3సార్లు వీరు ఎన్నికల్లో తలపడగా మరోసారి పోటీకి సై అంటున్నారు. 2014లో TDP తరఫున రవి, 2019లో సీతారాం YCP నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
Similar News
News August 18, 2025
తోటి దర్శకులను ప్రశంసించలేరా?.. నెట్టింట విమర్శలు

రూ.1000 కోట్ల దర్శకులు వినోదం పంచితే తమిళ డైరెక్టర్లు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారన్న దర్శకుడు మురుగదాస్ <<17434441>>వ్యాఖ్యలు<<>> చర్చకు దారి తీశాయి. తోటి దర్శకుల ఘనతను ప్రశంసించలేకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నెటిజన్లు ఫైరవుతున్నారు. వినోదంతో పాటు అంతర్లీనంగా జీవిత పాఠాలను చెప్పే దర్శకులు ఉన్నారని అంటున్నారు. మురుగదాస్ తీసిన కొన్ని సినిమాలను ప్రస్తావిస్తూ.. వాటితో ఏం ఎడ్యుకేట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.
News August 18, 2025
ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్నారా: అంబటి

AP: సినీ హీరో ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తీవ్ర <<17432318>>వ్యాఖ్యలు<<>> చేశారంటూ ఆడియో వైరలవ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త TDP అధిష్ఠానం దృష్టికి చేరడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘చిన్న ఎన్టీఆర్‌ను చూసి పెద బాబు, చిన బాబు భయపడుతున్నారా?’ అని చంద్రబాబు, లోకేశ్‌ను ట్యాగ్ చేశారు. అటు MLA వివరణ ఇచ్చుకున్నా NTR అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
News August 17, 2025
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: చంద్రబాబు

AP: ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై సీఎం రివ్యూ చేశారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు భాగస్వాములు అయ్యేలా చూడాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజలతో మమేకం అవ్వడం ద్వారానే పథకాలతో మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు.