News December 27, 2024

మన్మోహన్ విద్యాభ్యాసం.. పెషావర్ టు ఆక్స్‌ఫర్డ్

image

ఇప్ప‌టి పాక్‌లోని చ‌క్వాల్‌లో వ్యాపారులైన గురుముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు 1932 Sep 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పెషావర్‌లో అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చదివారు. దేశ విభజన తర్వాత 1948లో వారి కుటుంబం అమృత్‌సర్‌కు వచ్చింది. పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో DPhil పట్టా పొందారు.

Similar News

News July 9, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 9, 2025

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

image

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 9, 2025

నిమిషకు మరణశిక్ష.. తప్పెవరిది?

image

యెమెన్‌లో <<17008510>>నిమిష <<>>మరణశిక్ష ఎదుర్కోబోతుండటం చర్చనీయాంశంగా మారింది. పాస్‌పోర్ట్ లాక్కుని వేధిస్తున్నాడని మెహదీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని అతడికి ఆమె మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఆత్మరక్షణ కోసమే ఇలా చేసిందని, వదిలేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల తప్పు కూడా ఉందంటున్నారు. PM మోదీ జోక్యం చేసుకుని విడిపించాలని కోరుతున్నారు.