News December 27, 2024
మన్మోహన్ సింగ్.. శ్రీ సత్యసాయి బాబా భక్తుడు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాబా దర్శనం కోసం వచ్చేవారు. 2010లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 29వ కాన్విగివేషన్ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమానికి ఆయన అతిథిగా వచ్చారు. అనంతరం 2011లో సత్యసాయి బాబా మరణించిన రోజు వచ్చి కన్నీటి పర్వతమయ్యారు. 2016లో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.
Similar News
News December 28, 2024
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయని, దీంతో రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని టీడీపీ మండల కార్యదర్శి గోవిందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు 16 మందిపై కేసు నమోదైంది.
News December 28, 2024
బత్తలపల్లి: అభిమానులతో జగన్ సెల్ఫీ
కడప జిల్లా పర్యటన ముగించుకున్న జగన్ నిన్న శ్రీసత్యసాయి జిల్లా మీదుగా బెంగళూరు వెళ్లారు. ఈక్రమంలో బత్తలపల్లి టోల్గేట్ వద్ద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జగన్ను కలిశారు. ఆయనతో పాటు వైసీపీ అభిమానులు భారీగా వచ్చారు. వైసీపీ అధినేతతో ముచ్చటించడానికి పోటీ పడ్డారు. అందరితో జగన్ కరచాలనం చేశారు. చివరిలో ఇలా సెల్ఫీ తీశారు.
News December 28, 2024
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: అనంత జేసీ
అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 53వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు.