News December 27, 2024
విశాఖ: ‘నాలుగు రోజులు బ్యాంకు సేవలు నిలిపివేత’
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఏపీజీవీబీ ఆంధ్రా, తెలంగాణ విభాగాల విభజన దృష్ట్యా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ ఎస్.సతీశ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. జనవరి ఒకటి నుంచి బ్యాంకు సేవలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Similar News
News December 28, 2024
విశాఖ: ఈనెల 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,59,277 మంది లబ్ధిదారులకు రూ.69.21 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు.
News December 28, 2024
చింతపల్లి: చలి తీవ్రతకు మద్యం తాగి వ్యక్తి మృతి
చింతపల్లి మండలంలోని అన్నవరం సంతపాకలు వద్ద మద్యం అధికంగా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. చోడిరాయి గ్రామానికి చెందిన మువ్వల నాగేశ్వరరావు (50)అనే వ్యక్తి గురువారం రాత్రి మద్యం అధికంగా తాగాడు. మద్యం మత్తులో రాత్రి అక్కడే పడుకున్నాడు. అయితే చలి తీవ్రతకు శుక్రవారం ఉదయానికి మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నవరం ఎస్ఐ జీ.వీరబాబు తెలిపారు.
News December 28, 2024
చోడవరం: మేనల్లుడిని హత్య చేసిన మేనమామ
చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. ప్రేమ కుమార్ను మద్యం మత్తులో ఉన్న దుర్గ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.