News March 16, 2024
దాతృత్వానికి దక్కిన గౌరవం!

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక అవార్డు అందుకున్నారు. ముంబైలో జరిగిన వేడుకలో ప్రతినిధులు ఆయనకు అవార్డును అందించారు. దాతృత్వంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు దక్కింది. తన ఆదాయంలో సగానికి పైగా విరాళం ఇచ్చిన ఆయన.. ట్రస్టు ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Similar News
News April 7, 2025
సమ్మర్ ఎఫెక్ట్.. ధరలు రెట్టింపు

AP: ఎండలు పెరుగుతుండటంతో నిమ్మకాయ ధరలు రెట్టింపయ్యాయి. గత నెలలో క్వింటా రూ.6 వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ.12వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా వేసవిలోనే 4 లక్షల టన్నులు ఉంది. మరోవైపు మార్కెట్లో కాయ సైజును బట్టి ఒక్కోటి రూ.5-10 వరకు అమ్ముతున్నారు.
News April 7, 2025
పీయూష్ వ్యాఖ్యలపై స్టార్టప్ ఫౌండర్ ఫైర్

స్టార్టప్ కంపెనీలపై <<15987267>>పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు<<>> కొందరు మద్దతిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఓ స్టార్టప్ ఫౌండర్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నేను 100మందితో బుర్హాన్పూర్(MP)లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. ఇక్కడ విద్యుత్ సమస్య, లంచాల కోసం అధికారుల వేధింపులు సాధారణం. ఈ సమస్యలపై PMO, IAS అధికారులకు లేఖలు రాసినా స్పందన లేదు. సౌకర్యాలు కల్పించకుండా ఇన్నోవేషన్ కావాలంటే ఎలా?’ అని ఫైర్ అయ్యారు.
News April 7, 2025
యాక్షన్ థ్రిల్లర్గా ‘స్పిరిట్’!

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం మెక్సికోలో స్టార్ట్ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ‘స్పిరిట్ సినిమా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగే ప్రాజెక్టు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఇది సాలిడ్ యాక్షన్తో కూడిన థ్రిల్లర్ టైప్ సినిమా అని తెలియడంతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.