News December 27, 2024

వాల్తేరు డీఆర్ఎంగా లలిత్ బోహ్రా

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు పరిధిలో వాల్తేరు డివిజన్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆయన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వాల్తేరు డీఆర్ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. అప్పటినుంచి ఏడీఆర్ఎం ఇన్‌ఛార్జ్ డీఆర్ఎంగా పనిచేస్తున్నారు.

Similar News

News December 28, 2024

విశాఖ: ఈనెల 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,59,277 మంది లబ్ధిదారులకు రూ.69.21 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు.

News December 28, 2024

చింతపల్లి: చలి తీవ్రతకు మద్యం తాగి వ్యక్తి మృతి

image

చింతపల్లి మండలంలోని అన్నవరం సంతపాకలు వద్ద మద్యం అధికంగా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. చోడిరాయి గ్రామానికి చెందిన మువ్వల నాగేశ్వరరావు (50)అనే వ్యక్తి గురువారం రాత్రి మద్యం అధికంగా తాగాడు. మద్యం మత్తులో రాత్రి అక్కడే పడుకున్నాడు. అయితే చలి తీవ్రతకు శుక్రవారం ఉదయానికి మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నవరం ఎస్ఐ జీ.వీరబాబు తెలిపారు.

News December 28, 2024

చోడవరం: మేనల్లుడిని హత్య చేసిన మేనమామ

image

చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. ప్రేమ కుమార్‌ను మద్యం మత్తులో ఉన్న దుర్గ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.