News December 27, 2024
జనగామ: ఈ లాయర్ ఎఫెక్ట్.. మాజీ కలెక్టర్, అధికారులపై FIR
జనగామ మాజీ కలెక్టర్ శివలింగయ్యతో పాటు మరో 11 మంది<<14987938>> అధికారులపై ఎఫ్ఐఆర్ <<>>నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో రాచకొండ ప్రవీణ్ కుమార్ అనే న్యాయవాది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీత పక్షాన వాదించి ఆమె ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆధారాలతో రుజువు చేశారు. దీంతో అధికారులపై అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Similar News
News December 28, 2024
మన్మోహన్ పార్థివదేహానికి ఎంపీ వద్దిరాజు నివాళి
ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల ప్రముఖుడిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
News December 28, 2024
నల్లబెల్లి: రుద్రగూడెంలో పులిని చూసిన గ్రామస్థులు
నల్లబెల్లి మండలం <<14997161>>రుద్రగూడెం <<>>పెద్ద తండా వద్ద మొక్కజొన్న చేనులో రైతులకు పులి దర్శనం ఇవ్వడంతో వారు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో ఘటన ప్రాంతానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 28, 2024
జనగామ: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్
బస్టాండ్ ప్రదేశాలలో(రద్దీ) మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన సంధ్య అనే మహిళను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ.13 లక్షల విలువైన 171.23 గ్రాముల బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.