News December 27, 2024

కృష్ణా: MBA పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం ఓ ప్రకటనలో సూచించింది.

Similar News

News September 14, 2025

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.1000గా ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి.

News September 13, 2025

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు

image

కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు.

News September 13, 2025

గన్నవరంలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో రావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.