News March 16, 2024
దేశవ్యాప్తంగా ఇంటి నుంచి ఓటింగ్ అమలు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలుకానుంది. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గలవారికి ఈ అవకాశం ఇస్తామన్నారు. ఇందుకోసం ముందే రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటారని వెల్లడించారు.
Similar News
News November 5, 2024
CJI చంద్రచూడ్‌తో ఏకీభవించని జస్టిస్ BV నాగరత్న
ప్రైవేటు ఆస్తి ప్రజా వనరు కాదన్న సుప్రీంకోర్టు <<14535099>>తీర్పు<<>>లో కొన్ని అంశాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో జస్టిస్ బీవీ నాగరత్న విబేధించారు. 1978లో జస్టిస్ కృష్ణ అయ్యర్ సోషలిస్ట్ ఫిలాసఫీ ఇప్పటికి సరికాదని, వారి మైనారిటీ వ్యూ పరిగణనలోకి తీసుకోలేమని చంద్రచూడ్ అన్నారు. అప్పటి ప్రభుత్వ పాలసీల ఆధారంగా ఇచ్చిన గత జడ్జిల వైఖరిని ఇప్పుడు సరికాదన్న అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని జస్టిస్ నాగరత్న తెలిపారు.
News November 5, 2024
పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండాలి: మంత్రి తుమ్మల
TG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం కోసం వాట్సాప్ నంబర్ 8897281111ను సంప్రదించాలని చెప్పారు. పత్తి కొనుగోళ్లపై సమీక్షించిన ఆయన, నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 5, 2024
విద్యుత్ ఉత్పత్తి చేసే దుస్తులు!
గాలి, నీరు, బొగ్గు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే ఇప్పటివరకు చూశాం. అయితే, స్వీడన్‌లోని చాల్మర్స్ వర్సిటీ నిపుణులు సిల్క్ థ్రెడ్‌తో చేసిన వస్త్రాలతో కరెంట్ తయారుచేసే పద్ధతి కనుగొన్నారు. కండక్టివ్ ప్లాస్టిక్ మెటీరియల్ పూత ఉన్న సిల్క్ థ్రెడ్‌తో చేసిన దుస్తులు శరీరంలోని వేడిని గ్రహించి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇలా వచ్చిన విద్యుత్‌ను USB ద్వారా పోర్టబుల్ పరికరాలను ఛార్జ్ చేయొచ్చు.