News March 16, 2024

దేశంలో ఓటర్లు ఇలా..

image

✒ మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు
✒ పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు
✒ యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు
✒ తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు
✒ దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు
✒ 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82 లక్షలు
✒ 100 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 2.18 లక్షలు
✒ సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు
✒ ట్రాన్స్‌జెండర్లు 48,000

Similar News

News November 5, 2024

ఈ 6 నగరాల్లో ‘పుష్ప-2’ ప్రమోషన్స్?

image

భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న ‘పుష్ప-2’ సినిమా ప్రమోషనల్ టూర్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. మిడ్ నవంబర్‌లో ట్రైలర్ ఈవెంట్‌ సహా 6 నగరాల్లో మూవీ టీమ్ ప్రోమోషన్స్‌లో పాల్గొంటుందని సినీ వర్గాలు తెలిపాయి. పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ సందడి చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

News November 5, 2024

సీనియర్ IPSకు బెదిరింపులు.. కుమార స్వామిపై కేసు నమోదు

image

కేంద్ర మంత్రి కుమార స్వామి, అయ‌న కుమారుడు నిఖిల్‌పై బెంగ‌ళూరు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అక్రమ మైనింగ్ అనుమతుల మంజూరు కేసులో దర్యాప్తు చేస్తున్నత‌న‌ను కుమార స్వామి బ‌హిరంగంగా బెదిరించార‌ని ఆరోపిస్తూ సిట్ చీఫ్, ADGP చంద్రశేఖర్ ఈ ఫిర్యాదు చేశారు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాకుండా క‌ర్ణాట‌క క్యాడ‌ర్‌ నుంచి మరో క్యాడర్‌కు బదిలీ చేయిస్తాన‌ని బెదిరించిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News November 5, 2024

2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం.. IOA లేఖ

image

2036 ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ను భారత్‌లో నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అడుగులేస్తోంది. ఈ మేర‌కు క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచ‌ర్ హోస్ట్ క‌మిష‌న్‌కు భార‌త ఒలింపిక్స్ అసోసియేష‌న్‌ లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. ఈ లేఖ‌ను Oct 1న పంపిన‌ట్టు తెలిసింది. గతంలో 78వ స్వాతంత్ర్య దినోత్స‌వాల్లో ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ 2036లో ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌పై భారత ఆకాంక్షను వ్యక్తం చేశారు.