News December 27, 2024
కామారెడ్డి: UPDATE.. అనుమానంతో భార్య హత్య
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అవుసులతండాలో మహిళను ఆమె <<14980915>>భర్త కత్తితో నరికి చంపిన<<>> విషయం తెలిసిందే. కాగా హత్యకు సంబంధించి వివరాలను ఎస్ఐ శివకుమార్ వెల్లడించారు. అవుసులతండాకు చెందిన మెగావత్ మోతిబాయి(55) పై ఆమె భర్త షేర్య కొంత కాలంగా అనుమానం పెంచుకున్నాడు. కాగా బుధవారం ఆగ్రహంతో భార్య మోతిబాయిని హత్య చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News December 28, 2024
NZB: 2న జిల్లాకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్
ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అక్తర్ గురువారం(జనవరి 2న) నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయంపై దరఖాస్తులను కలెక్టరేట్‌లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
News December 28, 2024
నిజామాబాద్ పొలిటికల్ రౌండప్ @2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలకు 4 స్థానాలకు కైవసం చేసుకుంది. బీజేపీ 3 చోట్ల గెలుపొందిందగా బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించింది. కాగా జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవీ వరించింది. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, బీఆర్ఎస్ తమ వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిపై మీ కామెంట్
News December 28, 2024
చిట్టి పొట్టి సినిమా చూసిన ఎమ్మెల్యే ఏమన్నారంటే..?
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిట్టి పొట్టి సినిమా ను శుక్రవారం తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో తోబుట్టువుల ప్రేమ అనుబంధాలు, ఎమోషన్స్ తదితర వాటిని ఎంతో అద్భుతంగా చూపించారన్నారు. ‘ఇలాంటి సినిమాలు చాల అరుదుగా వస్తాయి. ఈ జనరేషన్ ఈ మూవీని తప్పకుండా చూడాలని’ అన్నారు. సినిమా దర్శకుడు, నిర్మాతలకు అభినందించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.