News December 27, 2024
ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.
Similar News
News December 28, 2024
అయ్యో.. 6 రోజులుగా బోరు బావిలోనే చిన్నారి
రాజస్థాన్‌లో ఆరు రోజుల క్రితం బోరుబావిలో పడిన చిన్నారి <<14987957>>చేతనను<<>> తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. NDRF, SDRF, స్థానిక పోలీసులు సంయుక్తంగా మిషన్‌లో పాల్గొంటున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. 150 అడుగుల లోతులో చిక్కుకున్న చేతనను క్లిప్పుల సాయంతో 30 అడుగుల పైకి లాగారు. అయితే ఆరు రోజులవుతున్నా ఇంకా చిన్నారిని కాపాడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News December 28, 2024
మన్మోహన్‌లా వాజ్‌పేయికీ జరిగితే BJP ఎలా ఫీలయ్యేది: కాంగ్రెస్ నేత
మన్మోహన్ స్మారక స్థలం కేటాయింపు అంశంలో BJPపై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శలు కురిపించారు. రాజ్‌ఘాట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకానికి స్థలం ఇవ్వకపోతే మీ పార్టీ ఎలా ఫీలయ్యేదని ప్రశ్నించారు. ‘మనిషి చనిపోయిన వెంటనే శత్రుత్వాలన్నీ మన్నులో కలిసిపోతాయి. కానీ ఇక్కడా రాజకీయాలు చేస్తున్నారు. అటల్‌జీ విషయంలో ఇలాగే జరిగేతే మీకెలా ఉండేది? ఇది ఓ పార్టీ అంశం కాదు. దేశ చరిత్రది’ అని అన్నారు.
News December 28, 2024
మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలి: చంద్రబాబు
AP: మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో నిర్వహించడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. ‘తెలుగు జాతి కోసం పొట్టిశ్రీరాములు అద్వితీయ త్యాగం చేశారు. సభల ప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం అభినందనీయం. మహాసభలకు విచ్చేసిన అతిథులు, భాషాభిమానులకు ధన్యవాదాలు’ అంటూ Xలో ట్వీట్ చేశారు.