News March 16, 2024

ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే

image

నెల్లూరు నగర శాసనసభ్యుడు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన నరసరావుపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో కార్పొరేటరుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు.

Similar News

News April 7, 2025

నెల్లూరు: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య(ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణ రావు ఓ ప్రకటనలో తెలిపారు. గత శుక్రవారమే కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్‌, జిల్లా కోఆర్డినేటర్ సుధీర్‌కు సమ్మె నోటీసు అందజేశామని చెప్పారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

News April 7, 2025

NLR: ఇంటర్ అమ్మాయితో అసభ్య ప్రవర్తన

image

పాఠాలు చెబుతానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నెల్లూరులో జరిగింది. నగరానికి చెందిన యువతి దర్గామిట్టలోని ఓ బిల్డింగ్‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటోంది. అదే భవనంలోని ఇన్సురెన్స్ ఆఫీస్‌లో శ్రీనివాసులు రెడ్డి పనిచేస్తున్నాడు. కెమెస్ట్రీలో డౌట్స్ క్లియర్ చేస్తానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.

News April 7, 2025

సింహపురి ప్రీమియం లీగ్ ప్రారంభం

image

నెల్లూరు సమీపంలోని బుజబుజ నెల్లూరు సీఐఏ క్రికెట్ అకాడమీలో సింహపురి ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ పి.విజయ్‌కుమార్, మదీనా ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ గూడూరు జట్టు 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఆత్మకూర్ రేంజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు సాధించి ఓడిపోయింది.

error: Content is protected !!