News December 27, 2024

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Similar News

News September 13, 2025

IBలో 394 జాబ్స్.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. SC, STలకు ఎగ్జామ్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీలు రూ.500 చెల్లించాలి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.<> www.mha.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 13, 2025

రేపే INDvsPAK.. మ్యాచ్ చూస్తారా?

image

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజే వేరు. కొందరైతే ఎంత ఖర్చయినా సరే విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తుంటారు. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాయాదుల పోరుపై చాలామంది ఇంట్రెస్టే చూపట్లేదు. కొందరేమో మ్యాచ్‌ను మ్యాచ్‌లా చూడాలంటున్నారు. SMలో ఇంత రచ్చ అవుతున్నా BCCI & ప్లేయర్లు స్పందించలేదు. ఇంతకీ రేపు జరిగే మ్యాచ్‌ను మీరు వీక్షిస్తారా? బహిష్కరిస్తారా? కామెంట్ చేయండి.

News September 13, 2025

చైనాపై 50%-100% టారిఫ్స్ వేయండి: NATOకు ట్రంప్ లేఖ

image

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50%-100% టారిఫ్స్ విధించాలని <<7824953>>NATO<<>>కు ట్రంప్ లేఖ రాశారు. ‘NATO దేశాలు రష్యా ఆయిల్ కొనడం ఆశ్చర్యంగా ఉంది. అదే మిమ్మల్ని బలహీనం చేస్తోంది. దీనికి సరేనంటేనే నేను ముందుకెళ్తాను. బలమైన టారిఫ్స్‌తోనే చైనా, రష్యా బంధం బ్రేక్ అవుతుంది. అప్పుడే యుద్ధం ఆగుతుంది. లేదంటే US టైమ్, ఎనర్జీ, మనీ వృథా అవుతాయి’ అని స్పష్టం చేశారు. లేఖలో భారత ప్రస్తావన లేకపోవడం గమనార్హం.