News December 27, 2024
విశాఖ: మెముకు బదులుగా సాధారణ రైళ్లు

మెముకు బదులుగా సాధారణ రైళ్లును ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడపనున్నట్లు వాల్తేరు డిసీఎం కే సందీప్ తెలిపారు. విశాఖ-పలాస-విశాఖ నెంబర్లతో ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు శుక్ర, ఆదివారాలు మినహా ఈ రైలు నడుస్తుందన్నారు. విశాఖ-విజయనగరం మధ్య మెము పాసింజర్ ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 28 వరకు గురువారాలు మినహా సాధారణ రైలుగా నడుస్తుందని అన్నారు. ఈనెల 28 నుంచి మార్చి ఒకటి వరకు నడుస్తుందన్నారు.
Similar News
News July 5, 2025
విశాఖ: A.P.E.P.D.C.L. పరిధిలో C.G.R.F సదస్సులు

ఈనెల 8 నుండి A.P.E.P.D.C.L. పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F) సదస్సులు నిర్వహిస్తామని ఛైర్మన్ బి.సత్యనారాయణ తెలిపారు. సంస్థ సెక్షన్ కార్యాలయాల్లో సదస్సులు జరుగుతాయన్నారు. విద్యుత్ వినియోగదారులు నేరుగా సదస్సుల్లో పాల్గొని ఫిర్యాదులు ఇవ్వాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లులు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
News July 5, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.
News July 5, 2025
ఎండాడలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

ఎండాడ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను మళ్లీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.