News December 27, 2024

శ్రీకాకుళం: పాసింజర్ రైళ్లు రద్దు..తప్పని అవస్థలు

image

పలు పాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను ఈనెల 27 నుంచి వచ్చే ఏడాది మార్చి 1 వరకు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. రైళ్ల రద్దుతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్వీసులను నడపాలన్నారు.

Similar News

News March 29, 2026

శ్రీకాకుళం: చికెన్ రూ.400.. గుడ్లు రూ.150

image

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధర ఒక్కసారి పెరిగింది. రూ. 400 స్కిన్లెస్ ధర ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 350కు సైతం అంటున్నారు. లైవ్ రూ. 210కి అమ్ముతున్నారు. కోడిగుడ్ల ధర మాత్రం స్థిరంగా ఉంది. 30 గుడ్లు రూ.150కి అమ్ముతున్నారు. చికెన్ ధర ఒకసారి పెరగటంతో సామాన్యులకు ఆర్థిక భారంగా ఉంది. వేసవిలో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

News March 29, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. ప్రధానంగా బూర్జ, హిరమండలంలో వడగాల్పులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని ప్రజలను హెచ్చరించారు.