News March 16, 2024
కొన్ని బంధాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి: పాండ్య
గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి హోమ్ టీమైన ముంబై ఇండియన్స్‌కు తిరిగొచ్చిన హార్దిక్ పాండ్య ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తన మిత్రులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను. తాజాగా ముంబై స్టార్ ప్లేయర్ పొలార్డ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు. మరింత బలపడతాయి. నా సోదరుడు పొలార్డ్‌తో కలిసి మళ్లీ పని చేయడానికి సంతోషిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 21, 2024
ఏంటీ.. అరటిపండు ఆర్ట్‌కు రూ.52 కోట్లా?
ఇది కూడా ఓ ఆర్టేనా? అనుకున్నవి కూడా రూ.కోట్ల ధరలు పలుకుతుంటాయి. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన వేలంలో గోడకు టేపుతో అంటించిన ఓ కళాఖండాన్ని క్రిప్టోకరెన్సీ ఎంట్రపెన్యూర్ జస్టిన్ సన్ ఏకంగా $6.2 మిలియన్లకు(రూ.52కోట్లు) కొనుగోలు చేశారు. దీంతో అత్యంత ఖరీదైన అరటిపండుగా ఇది రికార్డులకెక్కింది. హాస్యనటుడు మౌరిజియో కాటెలాన్ దీనిని రూపొందించారు. అరటిపండు కుళ్లిపోతే ఎలా మార్చాలో కూడా ఆయన చెప్పారు.
News November 21, 2024
విద్యుత్ ఛార్జీలపై జగన్ మొసలి కన్నీరు: మంత్రి గొట్టిపాటి
AP: విద్యుత్ రంగం గురించి మాజీ CM జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఆయన ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు మద్దతివ్వకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
News November 21, 2024
1995 తర్వాత అత్యధిక పోలింగ్.. ఎవరికి అనుకూలమో?
మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న 65.1% పోలింగ్ నమోదైంది. 1995లో రికార్డు స్థాయిలో 71.5% ఓటింగ్ నమోదవగా, ఆ తర్వాత ఇదే అత్యధికం. ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడం తమకే అనుకూలమని మహాయుతి, MVA ధీమాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ BJP కూటమివైపే మొగ్గు చూపగా, ఈ నెల 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా 1999లో 61%, 2004లో 63.4%, 2009లో 59.7%, 2014లో 63.4%, 2019లో 61.4% పోలింగ్ రికార్డయ్యింది.