News December 27, 2024
మన్మోహన్ జీవితం ఎందరికో స్ఫూర్తి
మన్మోహన్ సింగ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఆధునిక భారతదేశ పితామహుడిగా మార్చింది చదువు, తెలివితేటలే. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన తర్వాత ఆయన జ్ఞానానికి ముగ్ధుడై సింగ్‌కు సెండాఫ్ ఇచ్చేందుకు వైట్‌హౌస్ బయటకొచ్చి గౌరవించారు. 2014లో మాజీ ప్రధాని అయ్యాక జపాన్ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించారు.
Similar News
News December 28, 2024
ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం: బొత్స
AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.15,000 కోట్ల భారం మోపుతోందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ ప్రభుత్వం 7 నెలల్లోనే రూ.74 వేల కోట్ల అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లతో కలిపి రూ.లక్ష కోట్ల అప్పు చేసింది. ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’ అని ఆయన నిలదీశారు.
News December 28, 2024
BREAKING: 108 సిబ్బందికి అదనంగా రూ.4,000
AP: 108, 104 సేవలకు ఇకపై సింగిల్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 190 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని సూచించారు. దీంతో పాటు 58 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతి మండలంలో జనఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖపై సమీక్షలో వెల్లడించారు.
News December 28, 2024
మన్మోహన్ సింగ్‌కు రుణపడి ఉంటాం: నారా లోకేశ్
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కష్టకాలంలో ఆయన తమ కుటుంబాన్ని ఆదుకున్నారని తెలిపారు. ‘అలిపిరి ఘటన తర్వాత మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు భద్రత తగ్గించింది. ఈ విషయాన్ని మన్మోహన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన విశాల హృదయంతో ఆలోచించి బాబుకు పూర్తి భద్రత కేటాయించాలని ఆదేశించారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.