News December 27, 2024

ఇల్లందు – కారేపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం 

image

సింగరేణి మండల పరిధిలోని ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తిని ఉసిరికాయలపల్లికి చెందిన మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు. 

Similar News

News December 28, 2024

KMM: ఉత్సాహంగా ప్రారంభమైన సీపీఐ శతాబ్ది ఉత్సవాలు

image

సీపీఐ శత వసంతాల ఉత్సవాలు శుక్రవారం మణుగూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా రామానుజవరంలో అమరుల స్థూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పాత బస్టాండ్ నుంచి ఆదర్శ్ నగర్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.దీంతో ఎర్రజెండాలతో మణుగూరు వీధులు ఎరుపెక్కాయి. మహిళలంతా ఎర్రజెండాలను చేతపట్టి నడిచారు. సభా వేదికపై కళాకారులు నృత్య ప్రదర్శన చేసి అలరించారు.

News December 28, 2024

రూ.40 లక్షలు విలువచేసే రత్నాంగి కవచాలు విరాళం

image

భద్రాద్రి రాములవారికి HYD వాస్తవ్యులు రూ.40 లక్షలు విలువ చేసే రత్నాంగి కవచాలను శనివారం విరాళంగా ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు. ఈ కవచాలల్లో 51 వేల రత్నాలు ఉన్నాయని ఈవో తెలిపారు. దాతలు పిన్నమనేని బాలమురళీకృష్ణ, శాంతి దంపతులు, వారి కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.

News December 28, 2024

ఖమ్మం పొలిటికల్ రౌండప్ @2024

image

కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో 2024 కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలకు 9 గెలిచి ఊపుమీదుండగా భట్టి, తుమ్మల, పొంగులేటికి మంత్రి పదవులు దక్కడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిందన్నారు. BRS నుంచి గెలిచిన తెల్లం కాంగ్రెస్‌లో చేరారని.. ఆ పార్టీ ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందన్నారు. BJP, CPI, CPM ఎదగాలని ప్రయత్నిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. COMMENT