News March 16, 2024

బీజేపీలోకి గాయని అనురాధ పౌడ్వాల్

image

ఒకప్పటి ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ ఈరోజు బీజేపీలో చేరారు. సనాతన ధర్మంతో లోతుగా అనుబంధం కలిగిన రాజకీయ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఇది తన అదృష్టమని ఆమె తెలిపారు. ఆలయాల్లో వినిపించే ఓం జయ జగదీశ హరే, శివామృత వాణి, సాయి మహిమ వంటి భక్తిగీతాలతో పాటు 80, 90వ దశకాల్లో బాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆమె ఆలపించారు.

Similar News

News September 29, 2024

తెలంగాణపై మోదీ ప్రశంసలు

image

తెలంగాణ ప్రజలపై 114వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారని చెప్పారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయన్నారు. మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారని వెల్లడించారు. జూన్ నుంచి ఇప్పటివరకు 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామన్నారు. దీంతో తగ్గిపోతున్న వన సంపద మళ్లీ పెరుగుతోందన్నారు.

News September 29, 2024

IND vs BAN: మూడో రోజూ వర్షార్పణమే

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. మైదానం ఇంకా చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కాగా ఇవాళ ఉదయం నుంచీ వర్షం కురవకపోయినా మైదానం చిత్తడిగానే ఉంది. అంపైర్లు రెండు సార్లు ఇన్‌స్పెక్షన్ చేసి ఆట నిర్వహణకు అనువుగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News September 29, 2024

నస్రల్లా హత్య.. రంగంలోకి ‘బ్లాక్ యూనిట్’

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు బ్లాక్ యూనిట్ ప్రతీకారం తీర్చుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిని షాడో యూనిట్ లేదా యూనిట్ 910గా కూడా వ్యవహరిస్తారు. ఇది హెజ్బొల్లాలో కోవర్ట్ వింగ్. అప్పట్లో హెజ్బొల్లా చీఫ్ ముసావి హత్య అనంతరం ఈ యూనిట్ ప్రతీకార దాడులకు పాల్పడింది. లెబనాన్ బయట ఇది దాడులకు దిగుతుంది. యూదులు, దౌత్య కార్యాలయాలు, ఇజ్రాయెలీ పర్యాటకులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు చేస్తుంది.