News December 27, 2024

మన్మోహన్ సింగ్‌తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి

image

భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.

Similar News

News January 23, 2026

KNR: నిరుద్యోగ మైనార్టీలకు ఉచిత శిక్షణ

image

తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఫైర్ & సేఫ్టీ, వెబ్ & గ్రాఫిక్ డిజైనింగ్ ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తానమని దరఖాస్తులు చేసుకోవలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. 18-35 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులు. దరఖాస్తులను పిబ్రవరి 9 వరకు జిల్లా మైనార్టీ ఆఫీసులో సమర్పించాలని సూచించారు.

News January 22, 2026

కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో ?

image

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

News January 22, 2026

కరీంనగర్ ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్‌మేళా

image

కరీంనగర్‌ ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌డీబీ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఇంటర్ ఆపై చదివిన 20 నుంచి 30 ఏళ్లలోపు వయస్సున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్స్ జిరాక్సు కాపీలతో కశ్మీర్‌గడ్డలోని ఈసేవ పైఅంతస్తున గల ఉపాధి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు.