News December 27, 2024
సుజుకీ మాజీ ఛైర్మన్ కన్నుమూత
సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ ఓసాము సుజుకీ(94) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈనెల 25న మరణించారు. జపాన్‌లో 1930లో జన్మించిన ఓసాము 1958లో సుజుకీలో చేరారు. తక్కువ కాలంలోనే సంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు. దాదాపు 21 ఏళ్ల పాటు సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం భారత్‌లో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది.
Similar News
News December 28, 2024
కలెక్టర్ పిల్లలైతే ఇలాగే ఊరుకుంటారా?: తల్లి
రాజస్థాన్లో బోరుబావిలో పడిన <<14987957>>చిన్నారి<<>> తల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కూతురు అందులో పడి 6 రోజులైంది. ఆకలి, దాహంతో ఎంత వేదన అనుభవిస్తుందో? కలెక్టర్ పిల్లలైతే ఇలాగే వదిలేసేవారా?’ అని ఏడుస్తూ ప్రశ్నించారు. తన కూతురిని త్వరగా బయటికి తీసుకురావాలని వేడుకున్నారు. ఈనెల 23న చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. ఆమెను క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
News December 28, 2024
పవన్ టూర్ నకిలీ ఐపీఎస్ అరెస్ట్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనల్లో నకిలీ IPSగా చెలామణి అయిన సూర్యప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ పేరుతో అందరినీ మోసగిస్తున్నట్లు గుర్తించారు. భూకబ్జాలకు కూడా పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. కాగా విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్యప్రకాశ్ పవన్ మన్యం పర్యటనలో ఐపీఎస్ ఆఫీసర్‌గా హల్‌చల్ చేశారు. కొందరు పోలీస్ అధికారులు ఆయనకు సెల్యూట్ కొట్టి ఫొటోలు కూడా దిగారు.
News December 28, 2024
విశాఖలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
AP: విశాఖ వాసులకు అలర్ట్. GVMC పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని మేయర్, కమిషనర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిని వాడే వారిపై జరిమానా విధించడంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రజలకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.