News December 27, 2024
మన్మోహన్ సింగ్‌పై సంచలన కామెంట్స్

నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై శివసేన(షిండే) నేత, మాజీ MP సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన్మోహన్ గొప్ప నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటివరకు చెరిగిపోలేదు’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘అప్పుడు మీరూ ఆ ప్రభుత్వంలోనే ఉన్నారుగా’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల MH అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరారు.
Similar News
News March 14, 2026
‘సంభల్’లో నమాజ్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

<<15204583>>వివాదాస్పద సంభల్<<>>లోని మసీదులో నమాజ్ చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలన్న UP అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే SP, కలెక్టర్ బదిలీ చేయించుకోవాలని, లేదంటే రిజైన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి కమ్యూనిటీకి కేటాయించిన స్థలంలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది.
News March 14, 2026
Vote Vibe సర్వే.. బెంగాల్ సీఎంగా మమతకే ఓటు!

త్వరలో WB అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో Vote Vibe సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తర్వాతి CMగా మమతా బెనర్జీ వైపు 42% మంది ఓటర్లు మొగ్గు చూపారు. BJP నేత సువేందు అధికారికి 19% మంది మద్దతు పలికారు. ప్రస్తుతం మమత ప్రభుత్వ పనితీరు అద్భుతమని 34%, చాలా దారుణమని 18% మంది పేర్కొన్నారు. TMC అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న BJP ఆరోపణలను 47% మంది నమ్మడం గమనార్హం.
News March 14, 2026
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. డాలర్ కాకుండా యువాన్!

అమెరికా డాలర్‌ను దెబ్బకొట్టేందుకు ఇరాన్ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. US డాలర్ కాకుండా చైనీస్ యువాన్ కరెన్సీ చెల్లిస్తేనే ‘హార్ముజ్’ నుంచి నౌకలకు పర్మిషన్ ఇస్తామని ఇరాన్ ప్రతినిధి చెప్పినట్లు అల్-జజీరా తెలిపింది. కాగా ఎప్పటి నుంచో ఆయిల్ బిజినెస్ కేవలం అమెరికా డాలర్లలోనే జరుగుతోంది. దీనివల్ల డాలర్ సూపర్ పవర్‌ఫుల్‌గా మారి అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు దానికి గండి పడే ఛాన్సుంది.


