News December 27, 2024
ఒక్క నెలలో 15% ఎగిసిన Dr.Reddy’s

Dr.Reddy’s షేర్లు ఈ నెలలో 15% మేర ఎగిశాయి. గత 51 నెలల్లో మంత్లీ పెరుగుదలలో ఇదే అత్యధికం. 2020 Sepలో 22%, అలాగే 2023 జూన్‌లో 14.5% ఎగిశాయి. రేటింగ్ ఏజెన్సీ నోమురా Dr Reddysకు Neutral నుంచి Buy ఇవ్వడంతో గత 7 సెషన్లలో Price 11% పెరగడం గమనార్హం. 2026లో ఇతర సంస్థలతో పోటీ, నిర్వహణ ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉండడం సంస్థ పనితీరుకు పెద్ద సవాలు అని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News November 7, 2025
15 అడుగుల ఎత్తు పెరిగిన గోంగూర మొక్క

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.
News November 7, 2025
ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.


