News December 27, 2024
పేర్ని జయసుధ బెయిల్ పిటీషన్‌పై ముగిసిన వాదనలు
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 30న ఆర్డర్ పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై ఉదయం నుంచి వాడివేడిగా వాదనలు సాగాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా కోర్టు పీపీ లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News December 29, 2024
కృష్ణా: ఎంటెక్ పరీక్షా షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, రివైజ్డ్ షెడ్యూల్ వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని పరీక్షల విభాగం శనివారం పేర్కొంది.
News December 28, 2024
విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్
విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేజింగ్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 28, 2024
విజయవాడ: 1400 మంది యువతకు ఉద్యోగాలు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లభించాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మెగా వికసిత్ జాబ్ మేళా కార్యక్రమానికి సుమారు 5000 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఈ జాబ్ మేళాలో 1400 మంది నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అనంతరం ఉద్యోగం సాధించిన యువతకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.