News December 27, 2024
వైసీపీకి ఇంతియాజ్ రాజీనామా
విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మంత్రి టీజీ భరత్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 29, 2024
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: మంత్రి బీసీ
ప్రజల సహకారం లేకుంటే ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేమని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలంటే వారి సహకారం అవసరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా మెగా ర్యాలీని నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత బనగానపల్లెగా తీర్చిదిద్దుతామని అన్నారు.
News December 28, 2024
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్
కడప మహిళకు కర్నూలులో వైద్యులు అరుదైన ఆపరేషన్ పూర్తి చేశారు. కడపకు చెందిన రమణమ్మ గత కొన్నినెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్షించిన వైద్యులు కిడ్నీ, లివర్‌కు దగ్గరలో రక్తనాళాలు ఆనుకొని 8.సెం.మీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కర్నూలుకు రెఫర్ చేయగా.. యురాలజీ HOD డా. కే. సీతారామయ్య బృందంతో మూడు గంటల పాటు శ్రమించి కణితిని తొలగించినట్లు తెలిపారు. ఆమెను శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
News December 28, 2024
వాటితో నాకేంటి సంబంధం: మాజీ మంత్రి బుగ్గన
బేతంచెర్లలో గురువారం అధికారులు పలు గోదాములపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే వాటిలో కొన్ని క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయని, ఆ గోదాములు మాజీ మంత్రి బుగ్గనకు సంబంధించిన వారివిగా గుసగుసలు వినిపించాయి. దానిపై బుగ్గను స్పందిస్తూ .. బంధువులు కొందరు ప్రైవేటు గోడౌన్‌లు నిర్వహిస్తున్న మాట వాస్తవేమని.. అయితే తనకేంటి సంబంధమంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ విచారణలో ఎవరికి చెందినవో బయటకు వస్తాయన్నారు.