News December 27, 2024
HYDలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్ల బుకింగ్స్!
ఈ ఏడాదికి సంబంధించిన ఆర్డర్స్ నివేదికను స్విగ్గీ మార్ట్ విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ ఏడాది 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేశారని, దాదాపు 2 లక్షల కండోమ్‌లను బుక్ చేసినట్లు పేర్కొంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల్లో పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నట్లు తెలిపింది. నగర ప్రజలు కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు ₹31 కోట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కు ₹15 కోట్లు ఖర్చు చేశారంది.
Similar News
News December 29, 2024
14,300 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం
భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్, మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ కమాండర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆర్మీ పేర్కొంది. విగ్రహం బలగాల్లో స్ఫూర్తి నింపడంతో పాట భారత వీరత్వాన్ని ప్రత్యర్థులకు గుర్తుచేస్తుందని స్పష్టం చేసింది.
News December 29, 2024
మా ఫోన్ ఎత్తాలంటే డీజీపీ భయపడుతున్నారు: బొత్స
AP: DGP ద్వారకా తిరుమలరావు బలహీనంగా మారారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో భద్రతావైఫల్యానికి ఎవర్ని బాధ్యుల్ని చేస్తారు? ఈ ప్రభుత్వం ఏమైపోయింది? డీజీపీ మా ఫోన్ ఎత్తాలంటేనే భయపడుతున్నారు. మంత్రి కొండపల్లిపై వార్తలన్నీ తెలుగుదేశం సృష్టి. అభద్రతాభావంతోనే ఇలాంటి ప్రచారాలు చేసి కొండపల్లిని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
News December 29, 2024
పాక్ చేతిలో భారత టెస్టు ఛాంపియన్‌షిప్ భవిష్యత్తు
భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్ అర్హత ఇప్పుడు పాక్ చేతిలో ఉంది. PAKvsSA మ్యాచ్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో 148 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. మూడోరోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు స్కోరు 27/3గా ఉంది. మిగిలిన 121 రన్స్ చేస్తే టెస్టు ఛాంపియన్ షిప్‌కి సౌతాఫ్రికా అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 2 టెస్టులు శ్రీలంకతో ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఓడితేనే భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.