News December 27, 2024
పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం: ఎస్పీ

పోలీస్ కానిస్టేబుల్ ఎంపికను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30 నుంచి ఒంగోలులోని పోలీసు పెరేడ్ మైదానంలో ఎంపిక ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన తేదీ, సమయాల్లో సర్టిఫికెట్లతో రావాలని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
Similar News
News January 28, 2026
ప్రకాశం: మూడు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 2025-28 మధ్య కాలానికి గాను బార్ల లైసెన్సుల మంజూరుకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి షేక్. ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. ఒంగోలు మున్సిపల్ పరిధిలో ఒకటి, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 4 సాయంత్రం 6 లోగా దరఖాస్తు చేయాలన్నారు.
News January 28, 2026
గ్రూప్ – 2 ఫలితాల్లో సత్తా చాటిన ప్రకాశం పోలీసులు

తాజాగా విడుదలైన గ్రూప్ – 2 ఫలితాలలో ప్రకాశం పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు తమ సత్తా చాటారు. 2018 సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన కే. అశోక్ రెడ్డి, కే .వెంకటేశ్వర్లు, సూర్య తేజలు గ్రూప్ – 2 ఫలితాలలో పలు ఉద్యోగాలను సాధించారు. అశోక్ రెడ్డి డిప్యూటీ తహశీల్దారుగా, ఎక్సైజ్ ఎస్సైలుగా వెంకటేశ్వర్లు, సూర్య తేజలు ఎంపికయ్యారు. వీరికి తోటి సిబ్బందితో పాటు అధికారులు అభినందనలు తెలిపారు.
News January 28, 2026
గ్రూప్ -2లో ప్రకాశం వాసుల ప్రతిభ

గ్రూప్ -2 ఫలితాలలో ప్రకాశం జిల్లా వాసులు సత్తా చాటారు. CS పురానికి చెందిన నవీన్ యాదవ్ వెలిగండ్లలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహశీల్దార్‌గా ఎన్నికయ్యారు. అలాగే కనిగిరికి చెందిన మహమ్మద్ సమీర్ టీచర్ పని చేస్తూ.. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. వీరి విజయం కుటుంబంలో సంతోషాన్ని నింపుతోంది.


