News December 27, 2024
ఆ రోజున సెలవు రద్దు

TG: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా ఫిబ్రవరి 8న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 13న భోగి, 14న సంక్రాంతికి జనరల్ హాలిడేస్ ఇచ్చింది. 15న కనుమ పండుగను ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. సెలవుల జాబితా కోసం ఇక్కడ <
Similar News
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
News July 6, 2025
మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు.. ఎక్కడెక్కడ పెడతారంటే?

ఇటీవల బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి నగేశ్ ఆఫీస్‌లోని బాత్రూమ్లో మహిళల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. అయితే సీక్రెట్ కెమెరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా అద్దం వెనుక, తలుపు వద్ద, గోడ మూలల్లో, పైకప్పు సీలింగ్, బల్బులో, టిష్యూ పేపర్ బాక్స్‌లో, స్మోక్ డిటెక్టర్‌లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. అప్రమత్తతతో వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు.