News March 16, 2024
11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు సీజ్: ఈసీ

2022-23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ₹3,400 కోట్ల అక్రమ డబ్బును సీజ్ చేసినట్లు EC వెల్లడించింది. 2017-18తో పోలిస్తే 835% పెరిగినట్లు పేర్కొంది. గుజరాత్- ₹802 కోట్లు, తెలంగాణ-₹778 కోట్లు, రాజస్థాన్-₹704 కోట్లు, కర్ణాటక-₹384 కోట్లు, మధ్యప్రదేశ్-₹332 కోట్లు, మిజోరాం-₹123 కోట్లు, ఛత్తీస్‌గఢ్-₹78 కోట్లు, మేఘాలయ-₹74 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-₹57 కోట్లు, నాగాలాండ్-₹50 కోట్లు, త్రిపుర-₹45 కోట్లు.
Similar News
News September 7, 2025
ఈ నెల 15 నుంచి UPI లిమిట్ పెంపు.. రోజుకు ఎంతంటే?

ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్(P2M)కు UPI లిమిట్‌ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.
News September 7, 2025
ఇవాళ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చా?

ఇవాళ ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియాలోనూ స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మీరు ఎలాంటి పరికరం లేకుండానే గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది.
News September 7, 2025
హైదరాబాద్‌కు ‘గోదావరి’.. రేపు సీఎం శంకుస్థాపన

TG: మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-2, 3లకు సీఎం రేవంత్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,360 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మల్లన్నసాగర్ నుంచి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించనున్నారు. జీహెచ్ఎంసీ, ORR పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలకు తాగునీటి సరఫరాకు చేపట్టిన మరో ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు.