News December 27, 2024

త్వరగా నిద్ర రావాలంటే ఇలా చేయండి!

image

ప్రస్తుతం ఎంతోమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అలాంటివారికి 10-3-2-1 నియమం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, పడుకునే పది గంటల ముందు టీ/కాఫీ తాగొద్దు. పడుకునే మూడు గంటలలోపే ఆహారం తినాలి. 2 గంటల ముందు పని చేయడం ఆపేయాలి. గంట ముందు మొబైల్/టీవీ ఆఫ్ చేయాలి. ఇవి పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. SHARE IT

Similar News

News November 5, 2025

APPLY NOW : PGIMERలో ఉద్యోగాలు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<>PGIMER<<>>)13 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, BSc, MBBS/BDS, బీటెక్, MSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News November 5, 2025

చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.

News November 5, 2025

నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

image

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.