News December 28, 2024
VKB: జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!
✔మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, జిల్లా నేతలు✔పూడూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి✔GREAT: రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔VKD:మహిళ మెడలోంచి బంగారం చోరీ✔VKB:మన్మోహన్‌సింగ్‌కు సర్వశిక్షా ఉద్యోగల నివాళి✔VKB:మాస్టర్ ప్లాన్ డ్రోన్ సర్వే REPORT విడుదల✔యాలాల్: జాతరకు వచ్చిన భక్తులపై కుక్కల దాడి✔ కొడంగల్:వానరానికి ఘనంగా అంత్యక్రియలు
Similar News
News December 28, 2024
HYD: అవగాహనతోనే మదకద్రవ్యాల నిర్మూలన: సందీప్ శాండిల్య
అవగాహనతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. శనివారం ‘డ్రగ్-ఫ్రీ వెల్నెస్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియేట్ ఎడ్యుటెక్‌లతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మార్గదర్శకాలతో ఆన్లైన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
News December 28, 2024
CA Resluts: ఆల్ ఇండియాలో హైదరాబాద్ నం.1
CA ఫలితాల్లో హైదరాబాద్ యువకుడు సత్తాచాటాడు. నగరానికి చెందిన హెరంబ్ మహేశ్వరి ఆల్ ఇండియాలో టాప్(నంబర్ 1) ర్యాంక్ సాధించారు. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో 600 మార్కులకు 84.67 శాతంతో 508 మార్కులు సాధించారు. తిరుపతి వాసి రిషబ్ కూడా 508 మార్కులతో టాప్ ర్యాంక్‌లో నిలిచారు. అహ్మదాబాద్ యువతి రియా 3, కోల్‌కతా వాసి కింజల్ అజ్మేరా 4వ ర్యాంక్ సాధించారు.
News December 28, 2024
PJR.. నిన్ను హైదరాబాద్ మరువదు!
గ్రేటర్ రాజకీయాల్లో నేడు చీకటి రోజు. కార్మిక నాయకుడు, పక్కా హైదరాబాదీ P. జనార్దన్ రెడ్డి తుది శ్వాస విడిచిన రోజు. కార్మికనాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఖైరతాబాద్ నుంచి 5 సార్లు MLAగా గెలిచారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘటన PJRదే. ఒంటి చేత్తో హైదరాబాద్, రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అటువంటి మాస్ లీడర్ గుండెపోటుతో 2007 DEC 28న కాలం చేశారు. నేడు PJR వర్ధంతి.