News December 28, 2024

ఎచ్చెర్ల: దారుఢ్య పరీక్షలకు ముమ్మరం ఏర్పాట్లు

image

ఎచ్చెర్ల ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT,PET పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రవేశం,వెళ్లే మార్గాలను ఎస్పీ పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు అవసరమైన కౌంటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News December 28, 2025

రేపు శ్రీకాకుళం కలెక్టర్ గ్రీవెన్స్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సై‌ట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News December 28, 2025

కంచిలి వద్ద ప్రమాదం.. 10th విద్యార్థి స్పాట్‌డెడ్

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రణీత్ ఆదివారం కావడంతో తండ్రితో కలిసి బైక్‌పై సోంపేట మండలం పత్రకొండ నుంచి కంచిలి వస్తుండగా జలంత్రకోట జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మట్టా ప్రణీత్(16) మృతి చెందగా.. అతని తండ్రి హేమంతరావుకు (45) తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News December 28, 2025

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీలు పెరగనున్నాయా?

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో ప్రస్తుతం 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన, పాలనా సౌలభ్యంకోసం ప్రజలనుంచి వినతలు వచ్చాయి. ఈ మేరకు 52 కొత్త పంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుమతుల తర్వాత పంచాయతీ విభజన సాధ్యమవుతుందన్నారు.