News March 16, 2024

దేశంలో 7 ఫేజుల్లో ఎన్నికలు.. ఎప్పుడెప్పుడు?

image

ఫేజ్ 1 : ఏప్రిల్ 19 (21 రాష్ట్రాలు)
ఫేజ్ 2 : ఏప్రిల్ 26 (13 రాష్ట్రాలు)
ఫేజ్ 3 : మే 7 (12 రాష్ట్రాలు)
ఫేజ్ 4 : మే 13 (ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు)
ఫేజ్ 5 : మే 20 (8 రాష్ట్రాలు)
ఫేజ్ 6 : మే 25 (7 రాష్ట్రాలు)
ఫేజ్ 7 : జూన్ 1 (8 రాష్ట్రాలు)

Similar News

News November 23, 2024

ఆటోను ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి

image

AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. మృతులు కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.

News November 23, 2024

పోలీస్ స్టేషన్‌లోని మెయిన్ సీట్‌లో కాల భైరవుడి ఫొటో!

image

ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ప్రధాన అధికారిగా SHO ఉంటారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పోలీస్ స్టేషన్‌లో మాత్రం కాశీ విశ్వనాథుడి రూపమైన కాలభైరవుడు ఉంటారు. స్టేషన్‌లో ప్రత్యేకంగా కుర్చీలో ఫొటో పెట్టి, టోపీ, బల్ల ఉంచుతారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని విధులు నిర్వహిస్తారు. స్వామికి పూజలు చేశాకే విధులు మొదలుపెడతారు. భైరవుడిని ‘కొత్వాల్’ అని పిలుస్తుంటారు.

News November 23, 2024

రోహిత్ శర్మను మిడిలార్డర్‌లో ఆడించాలి: మాజీ బౌలర్

image

రోహిత్ శర్మ వచ్చిన తర్వాత కూడా కేఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని భారత మాజీ బౌలర్ దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్, రాహుల్ కాంబినేషన్ బాగుందని, సిరీస్ అంతా వీరిద్దరినే కొనసాగించాలని సూచించారు. ‘ఈ ఓపెనింగ్ భాగస్వామ్యం కొనసాగాలి. రోహిత్‌ మిడిలార్డర్‌లో ఆడొచ్చు. కామన్ సెన్స్‌తో ఆలోచిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.