News December 28, 2024
జర్మనీ పార్లమెంట్ రద్దు.. FEB 23న ఎలక్షన్స్
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ అక్కడి పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇటీవల జరిగిన ఓటింగ్‌లో అక్కడి సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయింది. 733 మంది సభ్యులున్న సభలో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 394 మంది ఓట్లు వేశారు.
Similar News
News December 29, 2024
అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!
TG: ఆదాయంలో మార్పు లేదు కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కూరగాయల నుంచి మాంసం వరకు అన్నీ భారమే. రాష్ట్రంలో కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తలకు మించిన భారంగా ఉంటోందని జాతీయ గృహ వినియోగ సర్వే తెలిపింది. ప్రతి నెలా నిత్యావసరాల నిమిత్తం రాష్ట్రంలోని కుటుంబాలకు రూ.5675 ఖర్చవుతోందని పేర్కొంది. నెలవారీ వ్యయంలో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.
News December 29, 2024
నేడు ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్
ప్రో కబడ్డీ లీగ్-2024 ఫైనల్ నేడు జరగనుంది. హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తుది సమరంలో తలపడనున్నాయి. రా.8 గంటలకు మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో నం.1గా ఉన్న హరియాణా తొలి సారి ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా నాలుగో టైటిల్‌పై కన్నేసింది.
News December 29, 2024
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్‌పై ఆమె విజయం సాధించారు. 2019లోనూ ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్‌గా హంపి రికార్డులకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు.