News March 16, 2024

2019లో ఓటర్ల సంఖ్య అలా.. ఇప్పుడిలా..!

image

ఓటర్ల వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు కాగా, ప్రస్తుతం అది 96.8 కోట్లుగా ఉంది. ఇందులో పురుష ఓటర్లు 46.5 కోట్లు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 49.7 కోట్లకు చేరింది. మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.1 కోట్లు ఉంటే.. ఇప్పుడు 47.1 కోట్లకు చేరింది. ఇక ట్రాన్స్‌జెండర్ల సంఖ్య 39,683 నుంచి 48,044కు.. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 45.64 లక్షల నుంచి 88.35 లక్షలకు చేరింది.

Similar News

News November 24, 2024

నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్‌ని గౌరవిస్తున్నాం: కెనడా

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తాము గౌరవిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే తామెప్పుడూ పనిచేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే యూకే, బెల్జియం, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, ఇరాన్, ఐర్లాండ్, జోర్డాన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, టర్కీ దేశాలు వారెంట్‌ను అంగీకరించాయి.

News November 24, 2024

దేశ రాజకీయాల్లో పరాన్న జీవిగా కాంగ్రెస్: మోదీ

image

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరాన్న జీవిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హరియాణాతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఖాళీ అయిందని సెటైర్లు వేశారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉందని, అది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమని చెప్పారు. ప్రపంచంలో ఏ శక్తి ఆర్టికల్ 370ని మళ్లీ తిరిగి తీసుకురాలేదని ప్రధాని స్పష్టం చేశారు.

News November 24, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 24, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5:10 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.