News December 28, 2024
యాక్సిడెంట్‌కు ముందు ఫొటో.. కంటతడి పెట్టిస్తోంది
భువనగిరి సమీపంలో శుక్రవారం రాత్రి <<14998405>>రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శామీర్‌పేటకు చెందిన దంపతులు జగన్, పావని వారి పిల్లలు సాత్విక, కన్నయ్య యాదాద్రి దర్శనం చేసుకున్నారు. తిరుగుప్రయాణంలో జరిగిన ప్రమాదంలో పావని, కుమారుడు కన్నయ్య మృతి చెందారు. తండ్రీకుమార్తెకు గాయాలయ్యాయి. దర్శనం అనంతరం రాయగిరి మినీ ట్యాంక్ బండ్ వద్ద ఫ్యామిలీతో దిగిన ఫొటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.
Similar News
News December 29, 2024
NLG: న్యూ ఇయర్.. ఈ ఆలయాలకు వెళ్లొచ్చు
న్యూ ఇయర్ వేడుకలకు ఉమ్మడి నల్గొండ ప్రజానీకం రెడీ అవుతోంది. కొత్త సంవత్సరం రోజు ఎక్కువగా ఆలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. కాగా ఉమ్మడి జిల్లాలో మట్టంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సూర్యాపేటలో పిల్లలమర్రి శివాలయం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి, పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయాలు ఫేమస్. మీరు ఏ ఆలయానికి వెళ్తున్నారు.
News December 29, 2024
నేరాలు పెరిగాయి: NLG ఎస్పీ
నల్గొండ జిల్లాలో గడిచిన ఏడాది నేరాలు పెరగ్గా, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. మహిళలపైన లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగానే జరిగాయన్నారు. దోపిడీలు, దొంగతనాలు కూడా గతేడాదితో పోల్చితే పెరిగాయని తెలిపారు. 2024లో జిల్లాలో 33 హత్యలు, 100 లైంగిక దాడులు, 657 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండను నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News December 29, 2024
భువనగిరి: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
గుండెపోటుతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. భువనగిరికి చెందిన దోసపాటి బాలరాజు (35) హైదరాబాద్ మొదటి బెటాలియన్ యూసఫ్‌గూడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండటంతో మార్గ మధ్యలో చనిపోయారు. బాలరాజు మృతితో బెటాలియన్‌లో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.