News December 28, 2024
ప్రకాశం: పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారా?.
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈనెల 30న ప్రారంభమై జనవరి 10 వరకు జరగనున్నాయి. మొత్తం 5,345 మంది హాజరు కానుండగా.. అందులో 4,435 మంది పురుషులు, 910 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా డబ్బు కడితే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేస్తారని SP అన్నారు. ఎవరైనా ఇలా నగదు వసూలుకు పాల్పడితే 9121102266కు కాల్ చేయాలన్నారు.
Similar News
News December 29, 2024
ఒంగోలు: జిల్లాలో వార్షిక నేర నివేదికను విడుదల
జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో 440 దొంగతనాలు జరిగాయని, 581 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన వార్షిక నేర నివేదికను ఆదివారం విడుదల చేశారు. గత ఆరు నెలల్లో రూ.1.7 కోట్లు చోరీ కాగా రూ. 1.4 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. రానున్న కొత్త ఏడాది జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు కొత్త పోలీసింగ్‌కు శ్రీకారం చుడతామన్నారు.
News December 29, 2024
క్రికెటర్ నితీశ్ తల్లిది మన ప్రకాశం జిల్లానే.!
ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌లో తెలుగు తేజం నితీశ్ కుమార్ సెంచరీ (189 బంతుల్లో 114)తో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. కాగా నితీశ్ తల్లి జోత్స్న ప్రకాశం జిల్లా వాసులే కావడం గమనార్హం. ఆమె ఒంగోలు మండలంలోని చెరువుకొమ్మాలెం గ్రామానికి చెందిన వారు. అలాగే నితీశ్ కుటుంబీకులు మేనమామలు, తాతయ్య, అమ్మమ్మలు జిల్లాలోనే ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో నితీశ్ ప్రతిభ చాటడంతో ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 29, 2024
ప్రకాశం: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
ప్రకాశం జిల్లాలో వచ్చే సంవత్సరం జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజును తత్కాల్ కింద వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని DEO కిరణ్ కుమార్ తెలిపారు. రూ.1000 జరిమానా రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వచ్చేనెల 10వ తేదీలోపు ఆన్లైన్లో నామినల్ రోల్స్ అందజేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.