News December 28, 2024
బత్తలపల్లి: అభిమానులతో జగన్ సెల్ఫీ

కడప జిల్లా పర్యటన ముగించుకున్న జగన్ నిన్న శ్రీసత్యసాయి జిల్లా మీదుగా బెంగళూరు వెళ్లారు. ఈక్రమంలో బత్తలపల్లి టోల్‌గేట్ వద్ద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జగన్‌ను కలిశారు. ఆయనతో పాటు వైసీపీ అభిమానులు భారీగా వచ్చారు. వైసీపీ అధినేతతో ముచ్చటించడానికి పోటీ పడ్డారు. అందరితో జగన్ కరచాలనం చేశారు. చివరిలో ఇలా సెల్ఫీ తీశారు.
Similar News
News August 7, 2025
స్పెషల్ డ్రైవ్.. 146 కేసులు నమోదు

డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో తనిఖీలు నిర్వహించి 53 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 93 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు జిల్లాలో డ్రంకన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు.
News August 7, 2025
నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని మహిళ సూసైడ్

గుంతకల్లు సోఫియా వీధికి చెందిన షమీం భాను(35) తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని, బ్లాక్ లిస్టులో పెట్టాడని మనస్తాపంతో పురుగుమందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. భాను మొదటి భర్తకు విడాకులు ఇచ్చి గుంతకల్లు సచివాలయ వీఆర్ఓ మహమ్మద్ వలిని గతేడాది వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం తరలిస్తుండగా మృతిచెందింది.
News August 7, 2025
రైతు కళ్లలో కారం చల్లి రూ.30 వేల పెన్షన్ డబ్బు చోరీ

వృద్ధ రైతు కళ్లలో కారం పొడి చల్లి రూ.30 వేలు చోరీ చేసిన ఘటన బ్రహ్మసముద్రం మండలం మాముడూరులో బుధవారం చోటుచేసుకుంది. పొలంలో ఉండగా గుర్తు తెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి తన వద్ద ఉన్న రూ.30 వేలు చోరీ చేశారని బాధిత రైతు భూతప్ప తెలిపారు. నెలనెలా పోగేసుకున్న పింఛన్ డబ్బులు మొత్తం దోచుకెల్లారని వాపోయారు. ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు.