News December 28, 2024
ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడిపై ఎఫెక్ట్!
ఏపీలో కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై ప్రభావం చూపుతోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. గతంతో పోలిస్తే ఒక్క డిసెంబర్‌లోనే రూ.40 కోట్ల రాబడి తగ్గినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్, సూర్యాపేట, KMM, కొత్తగూడెం, NLG, గద్వాల్ సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.
Similar News
News December 29, 2024
కొత్త ఆఫర్: రూ.277తో రీఛార్జ్ చేస్తే..
న్యూ ఇయర్ సందర్భంగా BSNL కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.277తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 120GB హై-స్పీడ్ డేటా వస్తుంది. రోజుకు గరిష్ఠంగా 2GB వాడుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. అయితే సిగ్నల్ సరిగా రావట్లేదని, నెట్ చాలా స్లో ఉంటోందని కస్టమర్లు BSNLపై ఫిర్యాదులు చేస్తున్నారు.
News December 29, 2024
ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులే: మంత్రి
AP: పేర్ని నాని ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతానికి ఎందుకు వెళ్లారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా 7 వేల రేషన్ బియ్యం బస్తాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశామని, లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులేనని, సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనేనని విమర్శించారు. సానుభూతి కోసం భార్య పేరును వాడుకుంటున్నారని ఫైరయ్యారు.
News December 29, 2024
ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు: డీజీపీ
TG: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 9.87% కేసులు పెరిగాయన్నారు. ఈ ఏడాది 1,942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును ఆయన వెల్లడించారు. రూ.142.50 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఒకటి, రెండు ఘటనలు మినహా శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.