News December 28, 2024
నిడదవోలు: యువతి అదృశ్యంపై కేసు నమోదు
నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన దేనాబోయిన అమర్నాథ్ కుమార్తె సునీత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై వీరబాబు తెలిపారు. శనివారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సునీత నిడదవోలు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుందన్నారు. ఈనెల 27న ఉదయం కళాశాలకు వెళ్లి ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదని, అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 29, 2024
ప.గో: ‘237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి’
ప.గో.జిల్లాలో ఇప్పటివరకు 237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా ప్రజల నుంచి భూ సంబంధ, రెవెన్యూ శాఖల పరంగా మ్యుటేషన్, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News December 29, 2024
ప.గో.: ఆ కేసును కొట్టివేయండి: మంత్రి
ఏలూరు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంత్రి నిమ్మల రామానాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హాజరు నుంచి మినహాయింపుతో పాటు కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 2022లో పాలకొల్లులో టిడ్కో ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడంలేదంటూ నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News December 29, 2024
సంక్రాంతి పండుగ.. హోటల్స్‌కు ఫుల్ డిమాండ్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప.గో జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్‌ల అద్దెలు కొండెక్కాయి. భీమవరం, ఏలూరు, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 4 రోజులకు గాను రూ.25 వేల- రూ.35 వేల వరకు అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.