News March 16, 2024
రామభద్రపురం: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

నాయుడువలస గ్రామానికి చెందిన M. నారాయణ రావు (46)చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణ రావు హైదరాబాద్‌లో చక్కెర కర్మాగారంలో పనిచేస్తూ సెలవుపై సొంతూరు కొద్ది రోజుల ముందు వచ్చారు. ఈరోజు ఇంటివద్ద ఉన్న చింతచెట్టు కాయలు కోస్తుండగా కాలుజారి పడ్డాడు. గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు హెచ్సీ సత్యనారాయణ తెలిపారు.
Similar News
News November 2, 2025
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొండపల్లి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News November 1, 2025
సహాయక చర్యల్లో విజయనగరం జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన భక్తులను ఆసుపత్రులకు తరలించి, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
News November 1, 2025
సిబ్బందికి విజయనగరం ఎస్పీ కీలక ఆదేశాలు

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అధికారులకు శనివారం ఆదేశించారు. భక్తులు పోలీసు సూచనలు పాటించాలని కోరారు. అవసరమైతే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, క్యూలైన్‌లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ తెలిపారు.


