News December 28, 2024
జీన్స్‌తో వచ్చాడని ఫైన్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన కార్ల్‌సన్

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ నుంచి మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే) నిష్క్రమించారు. జీన్స్ ధరించి గేమ్‌లో పాల్గొనగా FIDE నిబంధనలను ఉల్లంఘించారని ఆయనకు 200 డాలర్ల జరిమానా విధించింది. డ్రెస్ కోడ్ నిబంధనలు పాటిస్తేనే 9వ రౌండ్‌లో పాల్గొనే అవకాశముందని తేల్చి చెప్పింది. FIDE నిర్ణయంపై అసహనంతో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు కార్ల్‌సన్ తెలిపారు. తన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు.
Similar News
News February 2, 2026
అత్తింటి వేధింపులు.. ముగ్గురు పసిపిల్లల్ని చంపి..

కర్ణాటకలోని బగల్‌కోట్‌లో ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపిన ఓ తల్లి డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటిలోపలి వైపు తాళం వేసి ఉండగా స్థానికుల సాయంతో భర్త డోర్ ఓపెన్ చేశారు. పిల్లలు అప్పటికే చనిపోగా చావుబతుకుల్లో ఉన్న భార్య(రూప)ను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
News February 2, 2026
805 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)805 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 105 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD అర్హత గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in
News February 2, 2026
INC రెబల్స్‌కు 24 గంటల గడువు

TG: మున్సి‘పోల్స్’ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు వేసిన నామినేషన్లపై అందిన నివేదికను TPCC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్ పరిశీలించారు. అనేక చోట్ల రెబల్స్ బెడద ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు బరి నుంచి తప్పుకొనేలా చేయాలని మంత్రులు, DCC అధ్యక్షులను ఆదేశించారు. దానిపై మళ్లీ నివేదిక సమర్పించాలని సూచించారు.


