News December 28, 2024

100 పాములతో ఆ సీన్ చేశా: వెంకటేశ్

image

బొబ్బిలిరాజా సినిమాలో కొండ చిలువను పట్టుకునే సీన్ హాలీవుడ్ మూవీ నుంచి రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు విక్టరీ వెంకటేశ్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బొబ్బిలి రాజాలో ఒకటి కాదు ఏకంగా వంద పాములతో కలిసి సీన్ చేసినట్లు వెల్లడించారు. అది గ్రాఫిక్స్ కాదని స్పష్టం చేశారు. మొదట ఆ సీన్ చేసేందుకు భయపడినా తర్వాత ధైర్యం తెచ్చుకొని చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 29, 2024

నిన్న సమంత.. ఇవాళ కీర్తి సురేశ్.. ఇవి ఆగేదెలా?

image

సరికొత్త ఆవిష్కరణలకు అండగా ఉండాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న హీరోయిన్ <<15004135>>సమంత <<>>బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా, తాజాగా మరో నటి కీర్తి సురేశ్ ఫొటోలనూ గర్భంతో ఉన్నట్లు క్రియేట్ చేశారు. దీంతో ఇలాంటివి క్రియేట్ చేసే వారికి AIని దూరంగా ఉంచాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News December 29, 2024

క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారంటే..!

image

ప్రస్తుతం రుణం కావాలంటే ఏ సంస్థ అయినా క్రెడిట్ స్కోరు చూస్తుంది. లోన్లు, క్రెడిట్ కార్డులు కావాలంటే ఇది తప్పనిసరి. క్రెడిట్ స్కోర్‌ను కొన్ని ఆర్బీఐ అనుమతి పొందిన ఆర్థిక సంస్థలు నిర్వహిస్తుంటాయి. తొలుత ఈఎంఐలు, లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల ప్రకారం లెక్కిస్తారు. అలాగే రేషియో క్రెడిట్ స్కోర్ ఆధారంగా దీనిని నిర్వహిస్తారు. మీ పాత బ్యాంకులు, క్రెడిట్ కార్డుల హిస్టరీ ఆధారంగానూ లెక్కిస్తారు.

News December 29, 2024

రష్యా వల్లే విమానం కూలింది: అజర్ బైజాన్ Prez

image

క‌జ‌కిస్థాన్‌లో త‌మ దేశ విమానం కూలిపోయిన‌ ఘ‌ట‌న వెనుక ర‌ష్యా హ‌స్తం ఉంద‌ని అజ‌ర్ బైజాన్ అధ్య‌క్షుడు ఇల్హామ్ అలియేవ్ ఆరోపించారు. భూత‌ల కాల్పుల వ‌ల్లే దెబ్బతిన్న తమ విమానం కూలిపోయిందన్నారు. రష్యాలోని కొన్ని వర్గాలు ఈ ఘ‌ట‌న వెనకున్న వాస్త‌వాల్ని దాచిపెట్టి త‌ప్పుడు క‌థ‌నాల్ని వ్యాప్తిలోకి తెచ్చాయ‌ని అలియేవ్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న పుతిన్‌, బాధ్య‌త వ‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.