News December 28, 2024

తెలంగాణ ప్రభుత్వంపై అంబటి సెటైర్లు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచులో నితీశ్ పుష్ప తరహాలో సెలబ్రేషన్స్ ఉద్దేశించి ‘‘ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న ‘పుష్ప’ హీరో AAని వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా?’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల TGలో జరిగిన పరిణామాలపైన ఆయన వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News December 29, 2024

విచారణకు పవన్ ఆదేశం.. రంగంలోకి అధికారులు

image

AP: కాకినాడ వాకలపూడి తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. తాబేళ్ల మృతికి గల కారణాలను తెలుసుకోవాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కాకినాడ తీరంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని PCB అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.

News December 29, 2024

6 విమాన ప్ర‌మాదాలు.. 234 మంది మృతి

image

ప్ర‌పంచ ఏవియేష‌న్ రంగానికి డిసెంబర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల‌లో పలు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 234 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. అదివారం ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన ఒక్క ఘటనలోనే 177 మంది మృతి చెందారు. అంత‌కుముందు అజర్ బైజాన్ విమానం కజకిస్థాన్‌లో అనుమానాస్ప‌ద రీతిలో ప్ర‌మాదానికి గురైన ఉదంతంలో 38 మంది అసువులు బాశారు. మ‌రో 4 చోట్ల 19 మంది మృతి చెందడం సాంకేతిక సమస్యలపై ఆందోళన కలిగిస్తోంది.

News December 29, 2024

రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు

image

AP: నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్రంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని తెలిపారు. అర్ధరాత్రి కేక్ కటింగ్, మద్యం సేవించడం, అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం, డీజేలు, బైక్, కార్ రేసులు నిర్వహించకూడదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.