News December 28, 2024
మంచిర్యాల: ఆన్‌లైన్ గేమ్‌లో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి

ఆన్‌లైన్ గేమ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసగించిన కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో మంచిర్యాల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ PS SHO, DSP వెంకటరమణ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.1,36,96,290మోసపోయానని తమకు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తు చేయగా నిందితుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ మహమ్మద్ అబ్దుల్ నయీం అని తెలిసి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News January 5, 2026
వాహనదారుల భద్రతకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు-2026లో భాగంగా ఆయన మాట్లాడారు. వాహనదారుల భద్రత కోసం నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.
News January 5, 2026
ఆదిలాబాద్: నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. సోమవారం నాగోబా దేవాలయాన్ని కలెక్టర్, పీవో యువరాజ్ మర్మాట్ సందర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
News January 5, 2026
ఆదిలాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(38) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం ఇచ్చోడలోని తన స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.


