News December 28, 2024
తెలంగాణలో రీఎంట్రీకి ప్లాన్ సిద్ధం!
తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలు గ్రౌండ్ వర్క్ చేసి, చంద్రబాబు, లోకేశ్‌కు డిటెయిల్డ్ ప్లాన్ ఇచ్చినట్లు సమాచారం. తొలుత మహబూబ్‌నగర్ నుంచి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News December 29, 2024
మాతృభాష తల్లి పాలలాంటిది: కందుల దుర్గేశ్
AP: మాతృ భాష తల్లిపాలలాంటిదని, పరాయి భాష పోతపాలలాంటిదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. గత ప్రభుత్వం తెలుగు భాషకు తూట్లు పొడిచింది. ఇంగ్లిష్ మీడియం పేరుతో తెలుగుకు ద్రోహం చేసింది. తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యువత పుస్తకాలు చదివేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News December 29, 2024
టీమ్ ఇండియా WTC ఫైనల్ చేరాలంటే?
తొలిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా చేరుకుంది. మరో బెర్త్ కోసం భారత్‌కు ఆస్ట్రేలియా నుంచి తీవ్ర పోటీ నెలకొంది. మెల్‌బోర్న్ టెస్ట్ డ్రా చేసుకుని, తర్వాత జరిగే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాలి. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆసీస్ 0-1 తేడాతో ఓడిపోవాలి. లంకపై ఆస్ట్రేలియా ఎట్టిపరిస్థితుల్లో రెండు టెస్టులు గెలవకూడదు. ఇలా జరిగితే టీమ్ ఇండియా WTC ఫైనల్‌కు వెళ్తుంది.
News December 29, 2024
సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు
AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.